సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగానే కాకుండా సోషల్ మీడియాలోనూ యమక్రేజ్ తెచ్చుకున్నారు. ఇటీవలే ట్విట్టర్లో 10 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుని ఏ దక్షిణాది నటుడికి సాధ్యమవని రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో తనను అభిమానిస్తూ అనుసరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
"నా మనసులోని కృతజ్ఞతా భావాన్ని మీకు తెలిపేందుకు కోటి ధన్యవాదాలు అయినా సరిపోవు. మీ అందరితో ఇలాంటి వేదిక ద్వారా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ప్రేమతో మీ అందరికి ధన్యవాదాలు" అని మహేశ్‌బాబు రాసుకొచ్చారు.