తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జిమ్​లో మహేశ్​బాబు.. మీడియాకు గుణశేఖర్​ విన్నపం - మహేశ్​ బాబు వార్తలు

ప్రిన్స్​ మహేశ్​బాబు జిమ్​లో కసరత్తులు చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. మరోవైపు కొత్త సినిమా అప్​డేట్స్​ వచ్చేశాయి. ప్రదీప్​ సినిమాతో పాటు హీరో నాగశౌర్య కొత్త చిత్ర వివరాలు ఇందులో ఉన్నాయి.

Mahesh Babu gym video goes viral.. Director Guna shekhar request to media
జిమ్​లో మహేశ్​బాబు.. మీడియాకు గుణశేఖర్​ విన్నపం

By

Published : Jan 21, 2021, 2:24 PM IST

  • సూపర్​స్టార్ మహేశ్​బాబు జిమ్​లో వర్కౌట్స్​ చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. మహేశ్​ అందానికి రహస్యం ఇదేనా? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోకు 14 గంటల్లోనే ఐదు లక్షలకు పైగా వీక్షణలు దక్కాయి. మహేశ్​ బాబు ప్రస్తుతం.. పరశురామ్​ దర్శకత్వంలో రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు.
  • ప్రముఖ దర్శకుడు గుణశేఖర్​ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తోన్న చిత్రం 'శాకుంతలం'. ఇందులో సమంత ప్రధానపాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాపై అవాస్తవాన్ని ప్రచారం చేయోద్దని దర్శకుడు గుణశేఖర్​.. తన సన్నిహితులను, మీడియాను కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. నాయిక మినహా సినిమాలోని ఇతర పాత్రల ఎంపిక పూర్తవ్వలేదని.. వాటిపై అసత్య ప్రచారం వద్దని సూచించారు.
    దర్శకుడు గుణశేఖర్​ ప్రకటన
  • ప్రముఖ వ్యాఖ్యాత ప్రదీప్​ హీరోగా పరిచయమవుతున్న చిత్రం '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'. ఈ సినిమా ట్రైలర్​ను గురువారం (నేడు) సాయంత్రం 5.15 గంటలకు రౌడీ హీరో విజయ్​ దేవరకొండ విడుదల చేయనున్నారు.
    '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమా ట్రైలర్​ రిలీజ్​ పోస్టర్​
  • నాగశౌర్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'లక్ష్య'. ఈ సినిమా టీజర్​ను శుక్రవారం (జనవరి 22) ఉదయం 10.17 గంటలకు చిత్రబృందం విడుదల చేయనుంది.
    'లక్ష్య' సినిమా టీజర్​ రిలీజ్​ పోస్టర్​

ABOUT THE AUTHOR

...view details