తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పుట్టినరోజున మహేశ్ ఏం చేశాడో తెలుసా! - mahesh babu news latest

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​ బాబు తన పుట్టినరోజును వినూత్నంగా జరుపుకొన్నాడు. గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా తన పెరట్లో మొక్కలు నాటి ఇంతకంటే గొప్పగా బర్త్​డేను ఎలా సెలబ్రేట్​ చేసుకోవాలో తెలియలేదంటూ ట్వీట్​ చేశాడు.

mahesh babu green india challenge.. for his birthday
మహేశ్​

By

Published : Aug 9, 2020, 3:09 PM IST

'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' ఒక యజ్ఞంలా ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మొక్కలు నాటుతూ స్ఫూర్తినిస్తున్నారు. తాజాగా టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​ బాబు తన పుట్టినరోజు సందర్భంగా పెరట్లో మొక్కలు నాటాడు. ఇంతకంటే గొప్పగా బర్త్​డేను ఎలా జరుపుకోవాలో తెలియలేదంటూ ట్వీట్​ చేశాడు ప్రిన్స్​.

ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్​, తమిళ స్టార్​ విజయ్​, శ్రుతి హాసన్​లకు ఛాలెంజ్​ విసిరాడు మహేశ్​. అలా వారిని మరో ముగ్గురిని నామినేట్​ చేసి ఈ మహత్తర కార్యాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చాడు. 'ప్రకృతి పరిరక్షణ వైపు ఒక అడుగు' అని ట్విట్టర్​ వేదికగా సందేశమిచ్చాడు మహేశ్​.

ఇదీ చూడండి:అమ్మాయిల కలల 'రాకుమారుడు'.. సాయంలో 'శ్రీమంతుడు'

ABOUT THE AUTHOR

...view details