టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు ట్విట్టర్‌లో రికార్డును కొల్లగొట్టారు. తమ అభిమాన నటుడు ఆగస్టు 9న పుట్టినరోజు పురస్కరించుకుని.. ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ 'మహేశ్బాబుసీడీపీ' అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించారు. ఇప్పటికే ఈ హ్యాష్ ట్యాగ్ ఏకంగా 31 మిలియన్ల ట్వీట్స్ మార్క్‌ను అందుకుంది.
ఇది శాంపిల్ మాత్రమే అని పుట్టినరోజు నాటికి మరిన్ని రికార్డులు బద్దలవుతాయని మహేశ్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.