టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తాడు. షూటింగ్‌కు కాస్త విరామం దొరికినా వారితో విదేశాలకు వెళ్తుంటాడు. దసరా సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు చెప్పిన ప్రిన్స్.. 'సరిలేరు నీకెవ్వరు' పోస్టర్‌కు వచ్చిన స్పందనపై అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ పండుగను మరింత ప్రత్యేకం చేశారని చెప్పుకొచ్చాడు. అయితే ఈ హీరో కుటుంబంతో కలిసి దిగిన ఒక ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒకే కుర్చీలో మహేశ్, గౌతమ్, సితార ముందు కూర్చొని ఉండగా, వెనుకవైపు నమ్రత నిలబడి ఉన్న ఈ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది.
చూడముచ్చటగా మహేశ్‌బాబు ఫ్యామిలీ ఫొటో - bharat ane nenu cinema
'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బిజీగా ఉన్న హీరో మహేశ్‌బాబు కుటుంబ ఫొటో ఒకటి వైరల్‌గా మారింది.

మహేశ్‌బాబు ఫ్యామిలీ ఫొటో
ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో బిజీగా ఉన్నాడు మహేశ్. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. అనిల్ రావిపూడి దర్శకుడు. రష్మిక హీరోయిన్. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
ఇవీ చదవండి: