తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫ్యాషన్​ ప్రపంచంలో మహేశ్​ సొంత బ్రాండ్​! - విజయ్ దేవరకొండ

బ్రాండెడ్​ దుస్తుల వ్యాపారాన్ని మరో రెండు రోజుల్లో ప్రారంభించనున్నాడు హీరో మహేశ్​బాబు. ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నాడు. ​

వ్యాపారవేత్తగా మహేశ్​బాబు 'దూకుడు'

By

Published : Jul 27, 2019, 1:03 PM IST

సినిమాల్లోనే కాకుండా వ్యాపార రంగంలోనూ బిజీ అవుతున్నారు పలువురు సినీ ప్రముఖులు. ఆహార, వినోద రంగాల్లో తమదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్​ గచ్చిబౌలిలో 'ఏఎంబీ సినిమాస్' పేరుతో విలాసవంతమైన​ మల్టీప్లెక్స్​ను ప్రారంభించాడు హీరో మహేశ్​బాబు. ఇప్పుడు సొంతంగా దుస్తుల బ్రాండ్​ను ప్రారంభించనున్నాడు.

"మిమ్మల్ని మరింత చేరువయ్యేందుకు మరో విషయం పంచుకుంటున్నాం. ఈ రహస్యం తెలుసుకునేందుకు ఈ లింక్​ క్లిక్ చేయండి. http://www.spoyl.in/mahesh-babu" -ట్విట్టర్​లో టీమ్ మహేశ్​బాబు

టీమ్ మహేశ్​బాబు ట్వీట్

ఈ నెల 30న విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 'రౌడీ వేర్'తో హీరో విజయ్ దేవరకొండ, 'బీ ఇస్మార్ట్'​ పేరుతో దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ వ్యాపారంలో ఉన్నారు.

ఇది చదవండి: తన కూతురు సితారకు కొత్తగా విషెస్​ చెప్పిన ప్రిన్స్​ మహేశ్

ABOUT THE AUTHOR

...view details