తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలీవుడ్​కు వెళ్తున్న మేజర్​ అజయ్​కృష్ణ..! - హీరో మహేశ్​బాబు

మహేశ్​బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను బాలీవుడ్​లోనూ విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్​ జోడిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

సూపర్​స్టార్​ మహేశ్​బాబు

By

Published : Sep 29, 2019, 5:25 AM IST

Updated : Oct 2, 2019, 10:09 AM IST

గత కొంతకాలంగా టాలీవుడ్ స్థాయి పెరుగుతూ వస్తోంది. ప్రభాస్​, చిరంజీవి వంటి హీరోలు పాన్​ ఇండియా స్టార్స్​గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరేందుకు సిద్ధమవుతున్నాడు సూపర్​స్టార్​ మహేశ్​బాబు. ప్రస్తుతం నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాన్ని బాలీవుడ్​లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ బాధ్యతల్ని భార్య నమత్ర చేతిలో పెట్టాడట ప్రిన్స్ మహేశ్​. ఉత్తరాది ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాలో మరిన్ని ఎలిమెంట్స్‌ జత చేయమని డైరెక్టర్​కు మార్గనిర్దేశం చేసిందట నమ్రత.

ఈ చిత్రంలో హీరోయిన్​గా రష్మిక మందణ్న నటిస్తోంది. విజయశాంతి కీలక పాత్రలో కనిపించనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

మేజర్​ పాత్రలో సూపర్​స్టార్ మహేశ్​బాబు

మహేశ్.. బాలీవుడ్‌లో నేరుగా నటించనప్పటికీ డబ్బింగ్ సినిమాలతో అక్కడి ప్రేక్షకులకు బాగానే చేరువయ్యాడు. యూట్యూబ్‌లో వాటికి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. కాబట్టి నేరుగా ఈ హీరో నుంచి ఓ చిత్రం వస్తుందంటే ఉత్తరాదిలో మంచి అంచనాలే ఏర్పడే అవకాశముంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంతన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇది చదవండి: జీవితం అంటే ఇదే.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా: మహేశ్​బాబు

Last Updated : Oct 2, 2019, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details