సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు ఆయన కుమార్తె సితారతో ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ ఎప్పుడు చూసినా మంచి స్నేహితుల్లా కనిపిస్తుంటారు. నేడు మహేశ్ గారాల పట్టి సితార పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్తెపై భావోద్వేగంతో నిండిన ప్రేమతో శుభాకాంక్షలు చెబుతూ.. ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. "నీకు అప్పుడే 8 ఏళ్లు నిండిపోయాయి చిట్టితల్లి. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తుంటా. పుట్టిన రోజు శుభాకాంక్షలు కన్నా" అని సూపర్ స్టార్ రాసుకొచ్చాడు.
సితారపై ప్రేమతో మహేశ్ ఎమోషనల్ పోస్ట్ - సితార పుట్టిన రోజు స్పెషల్ న్యూస్
నేడు (జులై20)న సూపర్ స్టార్ మహేశ్‌బాబు ముద్దుల కుమార్తె సితార పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేశ్ ట్విట్టర్ వేదికగా భావోద్వేగ పోస్ట్ చేస్టూ శుభాకాంక్షలు తెలిపాడు.
మహేశ్
ఈ క్రమంలోనే సితార జీవితంలోని కొన్ని మధుర స్మృతులకు సంబంధించిన చిన్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు మహేశ్. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సితారకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.