సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కుమార్తె సితార.. నాన్నతో కలిసి అల్లరే కాకుండా అమ్మకు సాయం చేయడమూ తెలుసని చెబుతోంది. ఇటీవలే తమ ఇంటిలోపలి భాగాన్ని చీపురుతో శుభ్రం చేస్తూ కనిపించింది. అందుకు సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకుంది.
"ఈరోజు అమ్మకు సాయం చేద్దాం. ఇంటిని శ్రుభ్రం చేయడం నిజంగా చాలా ఫన్‌గా ఉంటుంది. అమ్మకు సాయం చేయడానికి నా దగ్గర చాలా సమయం ఉంది. వచ్చే వారం మరొక టాస్క్‌తో కలుద్దాం. అన్నట్టు నేను మంచి అమ్మాయినని అనుకుంటున్నా. మీ క్వారంటైన్ స్టోరీస్ ఏమైనా ఉంటే నాతో పంచుకోండి" అంటూ వీడియో దిగువన సితార రాసుకొచ్చింది.