తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పాలపిట్ట పాటకు సితార కిరాక్​ డ్యాన్స్​ - మహేశ్​బాబు కూతురు సితార

సూపర్​స్టార్​ మహేశ్​బాబు గారాల పట్టి సితార నెట్టింట హుషారుగా ఉంటుంది. ఇటీవల సొంతంగా యూట్యూబ్​ ఛానెల్​ ప్రారంభించింది. అందులో '3 మార్కర్స్ ఛాలెంజ్' అని ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంది. తాజాగా తండ్రి 'మహర్షి' సినిమాలోని ​పాటకు డ్యాన్స్​ చేసి నెట్టింట హల్​చల్​ చేస్తోంది.

సితార డ్యాన్స్​కు అభిమానులు ఫిదా..!

By

Published : Aug 13, 2019, 8:37 PM IST

Updated : Sep 26, 2019, 9:57 PM IST

ప్రిన్స్​ మ‌హేశ్​బాబు తనయ సితారకు నెట్టింట మంచి ఫ్యాన్​ ఫాలోయింగ్​ ఉంది. మరోసారి తన డ్యాన్స్​ టాలెంట్​తో ప్రిన్స్​ అభిమానులతో వావ్​​ అనిపించుకుంటోంది.

సూపర్​స్టార్​ మహేశ్​ నటించిన 'మహర్షి' చిత్రంలోని 'పాలపిట్ట' పాటకు డ్యాన్స్​ చేసింది సితార. ఆ వీడియోను నమ్రత సోషల్ ​మీడియాలో షేర్​ చేసింది.

" నువ్వు ఎంత చక్కగా ఉన్నావో. నేను ప్రతిరోజు సంతోషంగా నవ్వడానికి నువ్వే కారణం" అనే సందేశాన్ని చేర్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

ఇదీ చదవండి...యూట్యూబ్​ ఛానెల్​ ప్రారంభించిన మహేశ్​ కూతురు

Last Updated : Sep 26, 2019, 9:57 PM IST

ABOUT THE AUTHOR

...view details