తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినిమాకు ఇంకా టైముంది.. అయినా కటౌట్ అదిరింది - MAHESH BABU 81 FEET CUT OUT

దాదాపు 81 అడుగుల ఎత్తున్న హీరో మహేశ్​బాబు కటౌట్​ను హైదరాబాద్​లో నెలకొల్పారు. ఆ ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

సూపర్​స్టార్ మహేశ్​బాబు

By

Published : Nov 25, 2019, 4:26 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు.. 'సరిలేరు నీకెవ్వరు' చివరి షెడ్యూల్​తో బిజీగా ఉన్నాడు. సినిమా.. ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఇంకా సమయముంది. అయినా అభిమానులు ఆగితే కదా! హైదరాబాద్​లో అప్పుడే సందడి మొదలుపెట్టేశారు. సుదర్శన్ థియేటర్ దగ్గర దాదాపు 81 అడుగుల ఎత్తున్న కటౌట్​ నిలబెట్టారు. ఆ ఫొటోను చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర.. సోషల్ మీడియాలో పంచుకున్నారు.

సుదర్శన్ థియేటర్ దగ్గర ఏర్పాటు చేసిన మహేశ్​ కటౌట్

ఈ సినిమాలో హీరోయిన్​గా రష్మిక మందణ్న నటిస్తోంది. విజయశాంతి, ప్రకాశ్​రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్​రాజు-అనిల్ సుంకర-మహేశ్​బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే వచ్చిన టీజర్​ అలరిస్తోంది. వచ్చే సంక్రాంతికి థియేటర్లలోకి రానుందీ చిత్రం.

ఇది చదవండి: పండగ రేసులో ఒకరోజు ముందే వస్తున్న మహేశ్​బాబు

ABOUT THE AUTHOR

...view details