తరుణ్ హీరోగా.. నటుడు, దర్శకుడు కాశీ విశ్వనాథ్ తెరకెక్కించిన సినిమా 'నువ్వు లేక నేను లేను'. 2002లో విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. నటీనటులకు, దర్శకుడికి మంచిపేరు తీసుకొచ్చింది. మరి తరుణ్ స్థానంలో మహేశ్ బాబు నటించి ఉంటే ఎలా ఉండేది? ఎందుకంటారా.. ఈ సినిమా కథ పూర్తయ్యాక మహేశ్ బాబుతో చేద్దామా అని నిర్మాత సురేశ్ బాబు దర్శకుడ్ని అడిగారు. దానికి విశ్వనాథ్ ఇలా సమాధానం ఇచ్చారు.
'నువ్వులేక నేను లేను' హీరోగా మహేశ్ బాబు! - నువ్వులేక నేను లేనులో మహేశ్
తరుణ్ హీరోగా వచ్చిన 'నువ్వులేక నేను లేను' బ్లాక్బాస్టర్గా నిలిచింది. అయితే ఈ సినిమా నిర్మాత సురేశ్ బాబు మొదట ఈ కథ కోసం మహేశ్ బాబును తీసుకుందామని భావించారట.
మహేశ్ బాబు
"మహేశ్ అంటే చాలా ఆలస్యమవుతుంది. తనతో సినిమా చేసేందుకు చాలామంది క్యూలో ఉంటారు. ఈ కథకి తరుణ్ సరిగ్గా సరిపోతాడు. పైగా 'నువ్వే కావాలి' చిత్రంతో హిట్ అందుకున్నాడు," అని సురేశ్ బాబుకి చెప్పినట్టు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు విశ్వనాథ్. అలా మహేశ్ స్థానంలో తరుణ్ ఈ ప్రాజెక్టులో అడుగుపెట్టి విజయం అందుకున్నాడు.