లాక్డౌన్ కారణంగా ఇంటివద్ద కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేస్తున్నారు సినీతారలు. సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు తన ఇన్‌స్టాలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవేంటో మీరూ చూసేయండి.
మీకిష్టమైన కలర్, ఆహారం?
హైదరాబాద్ బిర్యానీ, నీలం
క్వారంటైన్ లైఫ్ గురించి చెప్పండి?
ఇది ఒక జీవితకాల అనుభవం. షూటింగ్ సమయంలో చేయలేనివి ఇప్పుడు చేస్తున్నా.
మీకు ఏ ఆటలంటే ఇష్టం?
గౌతమ్‌తో టెన్నిస్, గోల్ఫ్, బేస్‌బాల్ వీడియోగేమ్‌లు ఆడటం
షూటింగ్‌ను మిస్సవుతున్నారా?
అవును
మీ పిల్లల కోసం ఎలాంటి వంట చేస్తారు?
మ్యాగీ నూడిల్స్ చేస్తా
ఫాదర్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే?
ప్రేరణ. కానీ ఆయన గురించి చెప్పాలంటే ఒక్క మాట సరిపోదు
నమ్రతను ఎంతగా ప్రేమిస్తున్నారు?
మీకు ముందు పెళ్లయిందా చెప్పండి?
సమంత, రష్మిక గురించి చెప్పండి?
ఇద్దరూ ఫేవరేట్స్. అద్భుతంగా నటిస్తారు.
క్వారంటైన్ మీ లైఫ్‌స్టైల్‌ను ప్రభావితం చేసిందా?
అంతగా లేదు. ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. పొద్దున్నే లేస్తా. తొందరగా నిద్రపోతా. ఇదే నా లైఫ్‌స్టైల్
సర్. మీరు బాలీవుడ్లో సినిమా అస్సలు చేయరా?
నీకేమనిపిస్తుంది!
టెస్టు క్రికెట్ ఇష్టమా లేక టీ20నా?
టెస్టు
పూరి జగన్నాథ్ గారితో సినిమా చేస్తారా?
కచ్చితంగా చేస్తా. ఆయన నా ఫేవరేట్ డైరెక్టర్లలో ఒకరు. పూరి గారు వచ్చి ఓ స్టోరీ చెబుతారేమే అని ఎదురుచూస్తున్నా.