టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు కరోనా వల్ల దొరికిన ఖాళీ సమయంలో కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. తనయుడు గౌతమ్, తనయ సితారతో కాలక్షేపం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు నమ్రతా శిరోద్కర్ షేర్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ప్రిన్స్, సితారలకు సంబంధించిన మరో వీడియోను నమ్రత పోస్ట్ చేశారు. ఇందులో వారిద్దరూ టంగ్ ట్విస్టర్ ఆడుతూ కనిపించారు.
మహేశ్‌తో పోటీపడుతోన్న సితార.. ఎవరు గెలిచారు! - మహేశ్ బాబు టంగ్ ట్విస్టర్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు లాక్డౌన్ సమయంలో కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. తాజాగా తనయ సితారతో ఆడుకుంటోన్న ఓ వీడియోను నమ్రత నెట్టింట షేర్ చేశారు.
![మహేశ్‌తో పోటీపడుతోన్న సితార.. ఎవరు గెలిచారు! Mahesh Babu and Sitara Tongue Twister](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7735359-thumbnail-3x2-sa.jpg)
మహేశ్
ఇందులో సితార తాను సరిగ్గానే చెప్పానంటూ అంటుండగా మహేశ్ అలా కాదంటూ చెప్పడం అభిమానులను అలరిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇదే కాక ఇప్పటికే పలు వీడియోలలో ప్రిన్స్, పిల్లలతో కలిసి సందడి చేశారు.
ప్రస్తుతం మహేశ్‌బాబు 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లు అభిమానులను ఆకట్టుకున్నాయి.