సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మరికొన్ని రోజులపాటు దుబాయ్‌లోనే ఉండనున్నారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్ కథానాయిక. తాజాగా ఈ సినిమా షూట్ దుబాయ్‌లో ప్రారంభమైంది. ఈ క్రమంలోనే మహేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల దుబాయ్ చేరుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌లో కీర్తి సురేశ్, మహేశ్ పాల్గొంటున్నారు.
కాగా, లాక్‌డౌన్ అనంతరం సినిమా షూట్‌లో పాల్గొనడంపై మహేశ్ స్పందించారు. దుబాయ్ ఎంతో అందమైన ప్రాంతమని ఆయన అన్నారు. 'దుబాయ్ చాలా బాగుంటుంది. నాకు ఈ ప్రాంతమంటే చాలా ఇష్టం. గతంలో కూడా ఎన్నోసార్లు నేను దుబాయ్‌కు వచ్చాను. కరోనా పరిస్థితుల రిత్యా ఇక్కడ ఫాలో అవుతున్న నిబంధనలు చూస్తే మా చిత్రబృందం కూడా ఎంతో సేఫ్‌గా ఫీల్ అవుతోంది. వచ్చే నెలలో కూడా కొన్నిరోజులపాటు ఈ సినిమా షూట్ ఇక్కడే జరుగనుంది' అని ఆయన వివరించారు.