తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఖలేజా'కు పదేళ్లు: మహేశ్​ ట్వీట్.. ఆనందంలో ఫ్యాన్స్​ - ఖలేజా సినిమాకు పదేళ్లు

ఖలేజా సినిమాకు పదేళ్లు పూర్తయిన సందర్భంగా మహేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్​తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మనసులో మాట బయటపెట్టారు.

mahesh babu about 'khaleja 10 years' tweet
'ఖలేజా'కు పదేళ్లు: మహేశ్​ ట్వీట్.. ఆనందంలో ఫ్యాన్స్​

By

Published : Oct 7, 2020, 1:02 PM IST

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు చేసిన ఓ ట్వీట్‌తో అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆయన హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం 'ఖలేజా'. మహేశ్‌లోని హీరోయిజంతోపాటు కామెడీ టైమింగ్‌ను ప్రేక్షకులకు చేరువ చేసిన ఈ సినిమా విడుదలై బుధవారానికి 10 సంవత్సరాలు అవుతోంది. ఈ నేపథ్యంలో మహేశ్‌ ఓ ట్వీట్ పెట్టారు‌. త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా కోసం తాను వేచి చూస్తున్నట్లు వెల్లడించారు.

"ఖలేజా' విడుదలై పదేళ్లు అవుతోంది. ఒక నటుడిగా నన్ను నేను తిరిగి ఆవిష్కరించుకున్న చిత్రం. నా కెరీర్‌లో ఎప్పటికీ ఇది ప్రత్యేకమైన సినిమా. నాకు మంచి స్నేహితుడైన త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు. మన తదుపరి చిత్రం కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని మహేశ్​ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

మహేశ్‌ పెట్టిన ట్వీట్‌తో అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. 'సూపర్‌ కాంబినేషన్‌ వచ్చేస్తోంది', 'మహేశ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసింది..', 'మహేశ్‌-త్రివిక్రమ్‌ మరొక్కసారి వెండితెరపై సందడి చేయనున్నారు' అని కామెంట్లు పెడుతున్నారు. 'ఖలేజా' కంటే ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'అతడు' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకుంది.

'సరిలేరు నీకెవ్వరు' తర్వాత మహేశ్‌ 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు. పరుశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ కథానాయిక. అలాగే మహేశ్‌-రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా ఉండనుంది. మరోవైపు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details