తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సంక్రాంతి సెంటిమెంట్ కలిసొచ్చింది: మహేశ్​బాబు - hero movie nidhi agarwal

సంక్రాంతి పండగ తండ్రి కృష్ణలానే తనకు కలిసొచ్చిందని సూపర్​స్టార్ మహేశ్​బాబు అన్నారు. తన అభిమానులు 'హీరో' సినిమాతో పరిచయమవుతున్న ఆశోక్​ను ఆదరించాలని అన్నారు.

mahesh babu hero movie
మహేశ్​బాబు-హీరో మూవీ

By

Published : Jan 14, 2022, 7:17 PM IST

సంక్రాంతి పండుగ సూపర్ స్టార్ కృష్ణకు ఎంతో కలిసొచ్చేదని ఆయన తనయుడు మహేశ్ బాబు చెప్పారు. సంక్రాంతి పండుగకు కృష్ణ సినిమా విడుదలైందంటే ఘన విజయం తథ్యమని అన్నారు. ఆ సెంటిమెంటే తనకు ఒక్కడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, సరిలేరు నీకెవ్వరు చిత్రాల రూపంలో వచ్చిందని మహేశ్ చెప్పారు.

మహేశ్​బాబు-హీరో మూవీ గురించి

తమ కుటుంబం నుంచి మేనల్లుడు అశోక్ హీరోగా పరిచయం అవుతున్నాడని మహేశ్​ తెలిపారు. కృష్ణ అభిమానులు, తన అభిమానులు అశోక్​ను ఆదరించి హీరో చిత్రాన్ని ఘన విజయం చేయాలని ఆకాంక్షించారు. 'హీరో' చిత్ర బృందానికి మహేశ్​బాబు అభినందనలు చెప్పారు. అలాగే సూపర్​స్టార్ కృష్ణ కూడా తన మనవడిని ఆదరించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

హీరో మూవీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details