తెలంగాణ

telangana

ETV Bharat / sitara

15 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై పవర్​స్టార్, సూపర్​స్టార్​! - pawan kalyan

టాలీవుడ్​ అగ్రహీరోలు మహేశ్​బాబు, పవన్​కల్యాణ్ దాదాపు 15 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కనిపించనున్నారు. సినీ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబరు 8న జరిగే కార్యక్రమానికి వీరిద్దరూ హాజరుకానున్నారని సమాచారం.

మహేశ్ - పవన్ కల్యాణ్​

By

Published : Aug 29, 2019, 5:05 AM IST

Updated : Sep 28, 2019, 4:42 PM IST

పవన్​కల్యాణ్​, మహేశ్ బాబు.. టాలీవుడ్​ స్టార్​ హీరోలు. తమ స్టార్​డమ్​, ఫ్యాన్​ఫాలోయింగ్​ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇద్దరూ ఒకేచోట కనిపిస్తే అభిమానులు పండుగ చేసుకుంటారు. అయితే ఇది నిజం కాబోతుంది. సినీ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారంట ఈ ఇద్దరు అగ్రనటులు.

సెప్టెంబరు 8న ఈ కార్యక్రమం జరగనుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చిత్రపరిశ్రమ నుంచి ప్రముఖులు, 24 శాఖలకు సంబంధించిన వారు హాజరుకానున్నారు.

15 ఏళ్ల క్రితం పైరసీని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఓ వేదికలో వీరిద్దరూ పాల్గొని తమ గళం వినిపించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇద్దరూ ఒకే వేదికపై కనువిందు చేయనున్నారు. గతంలో పవన్ నటించిన జల్సా సినిమాకు మహేశ్ వాయిస్​ ఓవర్ ఇస్తేనే పండగ చేసుకున్న అభిమానులు ఇప్పుడు ఒకే వేదికపై వారిద్దరిని చూస్తే ఆ ఆనందానికి అవధులుండవు.

ఇది చదవండి: భాయ్​ ప్రస్థానానికి 31 ఏళ్లు... ఫ్యాన్స్​కు గిఫ్ట్

Last Updated : Sep 28, 2019, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details