తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మహా సముద్రం'లో రవితేజ.. తోడుగా అదితీ! - ఆర్ ఎక్స్ 100

'మహాసముద్రం' టైటిల్​తో రవితేజ ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. 'ఆర్.ఎక్స్ 100'తో ఆకట్టుకున్న అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్నాడు.

మహా సముద్రం'లో రవితేజ.. తోడుగా అదితీ..!

By

Published : Jul 15, 2019, 7:09 AM IST

ప్రస్తుతం 'డిస్కోరాజా' షూటింగ్​లో బిజీగా ఉన్నాడు హీరో రవితేజ. ఆ తర్వాత సినిమా యువదర్శకుడు అజయ్ భూపతితో ఉండనుందనే వార్త వినిపిస్తోంది. ఈ చిత్రానికి 'మహాసముద్రం' టైటిల్ ఫిక్స్ చేశారని, ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం.

గతేడాది ‘ఆర్‌ఎక్స్‌ 100’తో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు అజయ్‌ భూపతి. కానీ ఆ తర్వాత మరో సినిమాను పట్టాలెక్కించలేదు. ఇద్దరు ముగ్గురు ప్రముఖ హీరోలతో చేసేందుకు ప్రయత్నించినా అవేవి కుదరలేదు. అయితే ఎట్టకేలకు రవితేజను ఒప్పించి ఈ సినిమాను ప్రారంభించేందుకు అజయ్‌ సిద్ధమయ్యాడు.

'మహాసముద్రం'

త్వరలో ఈ సినిమాను సెట్స్​పైకి తీసుకువెళ్లనున్నారు. హీరోయిన్​గా ‘సమ్మోహనం’ ఫేమ్​ అదితీ రావు హైదరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై స్పష్టత రావాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

ఇది చదవండి: యూట్యూబ్​లో రికార్డు సృష్టించిన ఇండియన్ సాంగ్

ABOUT THE AUTHOR

...view details