టాలీవుడ్ హీరో శర్వానంద్ (Sharwanand), సిద్దార్థ్ నటిస్తున్న మల్టీస్టారర్ 'మహాసముద్రం' (Mahasamudram Telugu). 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్రబృందం ఓ ఫొటోను షేర్ చేసింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత సిద్ధార్థ్(Siddharth) తెలుగులో సినిమా చేయడం, దర్శకుడి తొలి సినిమా హిట్ కావడం వల్ల ఈ మూవీపై సినీప్రియుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.
'హిట్' రీమేక్‌లో 'దంగల్' బ్యూటీ
టాలీవుడ్లో విడుదలైన మిస్టరీ థ్రిల్లర్ 'హిట్'. విశ్వక్సేన్ (Vishwak Sen) హీరోగా చేయగా, శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకుడిగా పరిచయమయ్యారు. దీనికి వచ్చిన ఆదరణ చూసి, బాలీవుడ్‌లోనూ తీసేందుకు నిర్మాతలు దిల్‌రాజు, అల్లు అరవింద్ సిద్ధమయ్యారు. రాజ్‌కుమార్ రావ్‌తో (Rajkummar Rao) హిందీలో ఈ సినిమా రీమేక్ (Hit Movie Remake) చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో మరో కీలకపాత్ర కోసం సన్యా మల్హోత్రాను (Sanya Malhotra) ఎంపిక చేసింది చిత్రబృందం. ఇదే విషయాన్ని నిర్మాణసంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండగా, త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. మరి శైలేష్ అక్కడ కూడా 'హిట్' కొడతారో లేదో చూడాలి.