మహేశ్ నటించిన 'మహర్షి' చిత్రంలో మరో లిరికల్ పాట విడుదలైంది. 'పాలపిట్ట' అంటూ సాగే ఈ గీతం ఆకట్టుకుంటోంది. శ్రీ మణి సాహిత్యం అందించగా.. రాహుల్ సిప్లాగంజ్, ఎమ్ ఎమ్ మానసి ఆలరిపించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాలపిట్టతో "మహర్షి" ఆటపాటలు.... - palapitta
'మహర్షి' చిత్రంలో పాలపిట్ట లిరికర్ పాట విడుదలైంది. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేశ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
మహేశ్
'పాలపిట్టపై వలపు నీ పైట మెట్టుపై వాలిందే' అంటూ సాగుతున్న ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ గేయాన్ని విడుదలైన అరగంటకే దాదాపు రెండు లక్షల మంది వీక్షించారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన నాలుగు పాటలు సినీ ప్రియులను అలరిస్తున్నాయి.
మహర్షి సినిమా మహేశ్ బాబు నటిస్తున్న 25వ చిత్రం. దిల్ రాజు, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయిక. అల్లరి నరేశ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు.