సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన సినిమా 'మహర్షి'. ఈ చిత్రం నుంచి 'పదరా పదరా...' అంటూ సాగే లిరికల్ పాట విడుదలైంది. రైతుల కోసమే రూపొందించినట్లు ఈ పాటలోని ప్రతి అక్షరం స్పష్టం చేస్తోంది. శంకర్ మహదేవన్ ఆలపించిన ఈ గీతంలోని సాహిత్యం సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటోంది.
రైతుగా కనువిందు చేసిన సూపర్‌స్టార్ - అల్లరి నరేష్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు నటించిన 'మహర్షి' సినిమాలో 'పదరా పదరా..' అంటూ సాగే లిరికల్ పాట విడుదలైంది. సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది.
రైతుగా కనువిందు చేసిన సూపర్‌స్టార్
పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే వచ్చిన పాటలు సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. దేవీశ్రీప్రసాద్ సంగీతమందించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.