తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మహర్షి' సినిమా టికెట్ ధర పెంపు

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు  కెరీర్​లో​ 25వ చిత్రం ‘మహర్షి’. ఈ సినిమా టికెట్‌ ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. 30 రూపాయల నుంచి 63 రూపాయల వరకు ధర పెంచుతూ థియేటర్​ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి.

'మహర్షి' సినిమా టికెట్ల ధర పెంపు...రోజుకు ఐదు షోలు

By

Published : May 7, 2019, 8:40 PM IST

'మహర్షి' సినిమా ఈ నెల 9న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే హైదరాబాద్‌లోని పలు థియేటర్ల యాజమాన్యాలు టికెట్ల ధరలు పెంచేశాయి. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో 30 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ. 50 పెంచారు. ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో రూ.138 ఉన్న టికెట్‌ ధర రూ.200కి చేరింది. అయితే ప్రభుత్వ అనుమతితోనే ధరలు పెంచినట్లు యాజమాన్యాలు పేర్కొన్నాయి. రెండు వారాలపాటు ఇవే టికెట్​ రేట్లు అమలులో ఉండనున్నాయి.

ఐదుకు అనుమతి...

తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాకు 5 షోల వరకు అనుమతి ఇచ్చింది. భారీ బడ్జెట్​తో తెరకెక్కిన చిత్రం కావడం వల్ల ఈ అవకాశం కల్పించింది. మే 9 నుంచి మే 22 వరకు ఈ విధంగానే సినిమా ప్రదర్శించనున్నారు.
ప్రిన్స్​ మహేశ్‌ బాబుతో పూజా హెగ్డే హీరోయిన్​గా నటించింది. వంశీ పైడిపల్లి దర్శకుడు. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు బాగా ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details