"నా తర్వాతి సినిమా అతడితేనే.. ప్రశాంత్ నీల్‌తో ఓ కాఫీ తాగా" అంటున్నాడు సూపర్‌స్టార్ మహేష్‌బాబు. గత వేసవికి 'మహర్షి'గా ప్రేక్షకుల్ని అలరించిన ప్రిన్స్.. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో ముగ్గుల పండక్కి బాక్సాఫీస్‌ను దద్దరిల్లించేందుకు సిద్ధమయ్యాడు. 'ఎఫ్2' వంటి హిట్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం నుంచి వస్తోన్న చిత్రమిది. ఇక ఈ చిత్రంతోనే విజయశాంతి, సంగీత, బండ్ల గణేష్ వంటి నటులు తెరపైకి తిరిగి అడుగుపెట్టబోతున్నారు. జనవరి 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొస్తోంది.
'తర్వాతి చిత్రం ఆయనతోనే.. ప్రశాంత్‌తో కాఫీ తాగా' - mahesh babu, vamsi paidipalli
మహేష్ బాబు తర్వాతి చిత్రం ఎవరితోనో క్లారిటీ వచ్చేసింది. ప్రిన్స్ నటించిన 'సరిలేరు నీకెవ్వరు' ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో భాగంగా పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడీ హీరో.
తాజాగా చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మహేష్ మీడియాతో ముచ్చటిస్తూ.. తన తర్వాతి చిత్రాల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. "'సరిలేరు' తర్వాత మూడు నెలలు విరామం తీసుకుంటా. ఈలోపు నా కొత్త చిత్రానికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. నా తర్వాతి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే చెయ్యబోతున్నా. ఆయన చెప్పిన లైన్ బాగా నచ్చడం వల్ల వెంటనే ఆయనతో చేయడానికి సిద్ధమయ్యా. నేనెప్పుడూ దర్శకుడ్ని, కథనే నమ్ముతా. ఒకసారి ఓ దర్శకుడితో కనెక్ట్ అయ్యానంటే తర్వాత అతను చెప్పింది చెప్పినట్లు చేసుకెళ్లిపోతుంటా. 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ నన్ను కలిసిన మాట వాస్తవమే. ఇద్దరం కాఫీ కూడా తాగాం. కొన్ని స్టోరీ లైన్స్ కూడా చెప్పారు. కానీ, వాటిలో ఏం సెట్ అవుతాయి అన్నది తెలియదు. కేవలం ఆయన చెప్పినవి విన్నానంతే" అని స్పష్టతనిచ్చాడు మహేష్.
ఇవీ చూడండి.. మారుతి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాహీరో..!