దక్షిణాది సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నవనీత్ రాణా. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందింది. మంగళవారం హోలీ సందర్భంగా ఆ నియోజకవర్గ ప్రజలతో కలసి నృత్యం చేసింది.
అమరావతిలో స్టార్ హీరోయిన్ ధూంధాం - నవ్‌నీత్ కౌర్
ప్రముఖ హీరోయిన్ నవనీత్ రాణా హోలీ సందర్భంగా అమరావతి నియోజకవర్గంలో పర్యటించింది. అక్కడున్న ప్రజలతో కలసి నృత్యం చేసిందీ స్టార్ నటి.
![అమరావతిలో స్టార్ హీరోయిన్ ధూంధాం Maharashtra: Independent MP from Amravati, Navneet Rana dances with the tribals of Melghat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6361616-1014-6361616-1583852033192.jpg)
అమరావతిలో హీరోయిన్ ధూమ్‌ధాం
అమరావతి నియోజకవర్గ ప్రజలతో కలసి చిందేస్తున్న నవ్‌నీత్ రాణా
కన్నడ సినిమా 'దర్శన్'తో వెండితెరకు పరిచయమైన నవనీత్ రాణా.. దక్షిణాదిన పలు సినిమాల్లో కనువిందు చేసింది. ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్రీను వాసంతి లక్ష్మి' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. 2010 నుంచి చిత్రసీమకు దూరంగా ఉంది. మహారాష్ట్ర స్వతంత్ర శాసనసభ్యుడు రవి రాణాను 2011లో వివాహామాడింది.
ఇదీ చూడండి.. మణిరత్నం మ్యాజిక్: 25 వసంతాల బొంబాయి లవ్‌స్టోరీ
Last Updated : Mar 11, 2020, 8:34 AM IST