ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌కు అనుబంధంగా ఉన్న స్వప్న సినిమాస్.. 'కంబలపల్లి కథలు' అనే సరికొత్త వెబ్ సిరీస్‌తో రాబోతోంది. ఇందులో యంగ్ కమెడియన్ ప్రియదర్శి కీలక పాత్ర పోషించనున్నాడు. ఆదివారం షూటింగ్ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు ప్రియదర్శి.
ప్రియదర్శితో 'మహానటి' నిర్మాణ సంస్థ వెబ్‌సిరీస్
టాలీవుడ్ యంగ్ కమెడియన్ ప్రియదర్శి కీలక పాత్రలో నటించనున్న వెబ్ సిరీస్ 'కంబలపల్లి కథలు'. ఆదివారం ఈ సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది.
ప్రియదర్శి
గ్రామీణ నేపథ్యంలో రూపొందించనున్న ఈ సిరీస్‌లో హైబత్ అనే పాత్రలో ప్రియదర్శి కనిపించనున్నాడు. ఉదయ్ గుర్రాలా ఈ సిరీస్‌తో దర్శకుడిగా పరిచయం కానున్నాడు.
లఘుచిత్రాలతో ప్రయాణం మొదలుపెట్టి.. 'పెళ్లిచూపులు' సినిమాతో కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న ప్రియదర్శి.. ఇటీవలే 'మల్లేశం' చిత్రంలో భావోద్వేగంతో కూడిన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.