దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక కీర్తి సురేశ్.. బాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా పలకరించేందుకు అజయ్ దేవగణ్‌తో జత కట్టడానికి సిద్ధమైనట్లు తానే స్వయంగా గతంలో ప్రకటించారు. అజయ్ కథానాయకుడిగా నటిస్తున్న 'మైదాన్'లో ఆమె కథానాయికగా నటించనున్నట్లు వెల్లడించారు. బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
1952 నేపథ్యంలో ఫుట్‌బాల్ ఆటగాడు సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా తీస్తున్న సినిమా ఇది. కాగా, ఈ ప్రాజెక్టు నుంచి కీర్తి సురేశ్ తప్పుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమె, బోనీ పరస్పరం ఒప్పందానికి వచ్చారట. సినిమాలోని పాత్రకు కీర్తి సురేశ్ సరిపోవడం లేదని తెలిసింది.