తెలుగు కథానాయిక సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' వెండితెరపై మంచి విజయాన్ని అందుకుంది. విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం మరో ఘనత సాధించింది.
చైనాలో 'మహానటి'కి అరుదైన గౌరవం - షాంగై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మహానటి'. ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది.

చైనాలో 'మహానటి'కి అరుదైన గౌరవం
చైనాలో జరగనున్న 22వ షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమా ప్రదర్శించనున్నారు. జూన్ 15 నుంచి 24 వరకు ఈ ఫెస్ట్ జరగనుంది. షాంఘైలో ప్రదర్శితమవుతున్న తొలి భారతీయ చిత్రంగా పేరుతెచ్చుకుంది 'మహానటి'. ఈ నిర్ణయంపై చిత్రబృందం హర్షం వ్యక్తం చేసింది.
ఇందులో సమంత , విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్ సహా మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ముఖ్య పాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్ ఈ సినిమా నిర్మించింది.