తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరో సూర్య పాడిన 'మహా థీమ్​' విడుదల

సూర్య హీరోగా, సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆకాశం నీ హద్దురా'. తాజాగా ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేసింది చిత్రబృందం.

సూర్య
సూర్య

By

Published : Jan 24, 2020, 5:21 PM IST

Updated : Feb 18, 2020, 6:19 AM IST

సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'సురరై పోట్రు'. తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో తీస్తున్నారు. ఇందులో సూర్య ఓ పాట పాడాడు. తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా ఆ గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం.

'మహా థీమ్‌' పేరిట శ్రోతల ముందుకు వచ్చిందీ గీతం. "నన్ను తాకి చూడరా" అంటూ పవర్‌ఫుల్‌గా సాగే ఈ గీతం అందరిని ఆకట్టుకుంటుంది. జీవీ ప్రకాష్‌ స్వరాలు సమకూర్చాడు. కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్‌ బాబు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమవుతుంది. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. స్నేహకు ఆడబిడ్డ.. ఏంజిల్ వచ్చిందంటూ పోస్ట్

Last Updated : Feb 18, 2020, 6:19 AM IST

ABOUT THE AUTHOR

...view details