తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మహాసముద్రం'లో వారిద్దరూ స్నేహితులుగా

'మహాసముద్రం' సినిమాలో కథానాయకులు ఇద్దరూ స్నేహితుల్లా కనిపిస్తారట. ప్రస్తుత పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత షూటింగ్​ ప్రారంభించనున్నారు.

'మహాసముద్రం'లో వారిద్దరూ స్నేహితులుగా
శర్వానంద్ సిద్దార్థ్

By

Published : Jun 22, 2020, 7:00 AM IST

'ఆర్‌.ఎక్స్‌.100'తో విజయాన్ని సొంతం చేసుకున్న అజయ్‌ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం' తెరకెక్కబోతోంది. శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా నటిస్తారు. అనిల్‌ సుంకర నిర్మాత. ఈ చిత్రానికి స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. పరిస్థితులు కొలిక్కిరాగానే షూటింగ్​ మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఇందులో హీరోలు స్నేహితులుగా కనిపించబోతున్నారని సమాచారం. ఈ కథలో స్నేహం, ప్రేమతో పాటు నేర నేపథ్యమూ కీలకమని తెలుస్తోంది. అదితిరావు హైదరీ కథానాయికగా నటించబోతోంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details