‘మహా’ సినిమాలో హన్సిక మాజీ ప్రియుడు శింబు అతిథి పాత్ర చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా హన్సిక ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘90ఎమ్ఎల్’ చిత్రంలోనూ అతిథి పాత్ర పోషించాడు ఈ తమిళ హీరో.
- 'దేశముదురు' చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టిన నటి హన్సిక. తరువాత కోలీవుడ్లో ఫుల్ బిజీ అయిపోయిందీ అమ్మడు. తమిళంలో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తోంది. 15 ఏళ్ల క్రితం వెండితెరకు పరిచయమైన హన్సిక అప్పుడే 50 సినిమాల మార్కును అందేసుకుంది.