తెలంగాణ

telangana

ETV Bharat / sitara

"వకీల్​సాబ్​'కు ఆ టైటిల్​ పెట్టాల్సింది!' - వేణు శ్రీరామ్ వార్తలు

పవన్​ కల్యాణ్​, శ్రుతిహాసన్​ జంటగా నటించిన చిత్రం 'వకీల్​సాబ్​'. ఏప్రిల్​ 9న ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే తొలుత ఈ చిత్ర టైటిల్​ను 'మగువా' అని దర్శకుడు అనుకున్నారట. కానీ, ఆ తర్వాత దాన్ని 'వకీల్​సాబ్​'గా ఖరారు చేశామని చిత్ర ప్రమోషన్స్​లో దర్శకుడు వేణు శ్రీరామ్​ వెల్లడించారు.

maguva was the initial title of vakeel saab, Says Director Venu Sriram
"వకీల్‌సాబ్‌'కు మొదట వేరే టైటిల్‌ అనుకున్నాం'

By

Published : Mar 21, 2021, 2:17 PM IST

Updated : Mar 21, 2021, 6:28 PM IST

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ నటించిన చిత్రం 'వకీల్‌సాబ్‌'. బాలీవుడ్‌లో తెరకెక్కిన 'పింక్‌'కు రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. తమన్‌ స్వరాలు అందించారు. సినీ ప్రియులు ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ నేపథ్యంలో 'వకీల్‌సాబ్‌' ప్రమోషన్‌లో చిత్ర దర్శకుడు వేణుశ్రీరామ్‌, సంగీత దర్శకుడు తమన్‌, సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. అయితే ఈ సినిమాకు తొలుత 'వకీల్​సాబ్​' కాకుండా 'మగువా' అనే టైటిల్​ను అనుకున్నారట. ఆ తర్వాత దాన్ని మార్పు వెనుకున్న కారణాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు దర్శకుడు వేణు శ్రీరామ్. ​

'వకీల్​సాబ్​' ప్రమోషన్స్​

"ఈ కథ సిద్ధమవ్వుగానే మొదట 'మగువా' అనే టైటిల్‌ అనుకున్నాం. ఆ తర్వాత పవర్‌స్టార్‌ని దృష్టిలో ఉంచుకొని 'వకీల్‌సాబ్‌' టైటిల్‌ ఫిక్స్‌ చేశాం. ఇందులోని 'మగువా' పాటకు రామజోగయ్య అందించిన లిరిక్స్‌ అత్యద్భుతంగా ఉన్నాయి. సాధారణమైన భాషలో ఈ పాట రాశారు. మొదట ఈ పాట వినగానే కన్నీళ్లు వచ్చేశాయి. నా మూడేళ్ల పాప కూడా ఈ పాట పాడుతుంది."

- వేణు శ్రీరామ్​, దర్శకుడు

ఈ చిత్రంలో పవన్​ సరసన శ్రుతిహాసన్ నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత.

ఇదీ చూడండి:'వకీల్​సాబ్​'లో పవన్​ ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​!

Last Updated : Mar 21, 2021, 6:28 PM IST

ABOUT THE AUTHOR

...view details