'వకీల్‌సాబ్' సినిమాలోని 'మగువా మగువా' ఫిమేల్ వెర్షన్ ఫుల్ వీడియో సాంగ్ తాజాగా విడుదలైంది. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా శ్రీరామ్ వేణు తెరకెక్కించిన చిత్రమిది. అంజలి, నివేదా థామస్, అనన్య, శ్రుతి హాసన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.
'మగువా మగువా' పుల్ వీడియో సాంగ్ రిలీజ్ - మగువా మగువా ఫీమేల్ వెర్షన్ ఫుల్ సాంగ్
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'వకీల్‌సాబ్' చిత్రంలోని 'మగువా మగువా' ఫిమేల్ వెర్షన్ ఫుల్ వీడియో సాంగ్ రిలీజైంది. ఈ చిత్రం శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది.
మగువా మగువా పుల్ వీడియో సాంగ్ రిలీజ్
ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం ఏప్రిల్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో మగువా గీతానికి సంబంధించిన వీడియోని పంచుకుంది చిత్రబృందం. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటని మోహన భోగరాజు ఆలపించారు. తమన్ స్వరాలు సమకూర్చారు.