తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గాత్రంతో మైమరపిస్తున్న ఈ చిన్నారెవరో తెలుసా..? - డార్లింగ్‌ డైరెక్టర్‌

యువతను ఆకట్టుకునే చిత్రాలు చేయడంలో దర్శకుడు సుకుమార్​ది అందెవేసిన చేయి. మరి అంతటి టాలెంట్​ ఉన్న దర్శకుడికి పుట్టిన సుకృతి.. సంగీతంలోనూ అంతే ప్రతిభ చూపిస్తోంది. తాజాగా ఆ చిన్నారి సప్తస్వరాలను తనదైన గాత్రంతో పాటగా.. నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

Magical Voice: The aura of music by Sukriti Bandreddi is gone Viral in Social Media
గాత్రంతో మైమరపిస్తున్న ఈ చిన్నారెవరో తెలుసా..?

By

Published : Jan 22, 2020, 4:14 PM IST

Updated : Feb 18, 2020, 12:07 AM IST

టాలీవుడ్​ సెన్సేషనల్​ డైరెక్టర్‌ సుకుమార్‌ కుమార్తె సుకృతి... తన టాలెంట్‌తో ఔరా అనిపిస్తోంది. జనవరి 11న సుకుమార్‌ 50వ పుట్టినరోజు జరిగింది. ఈ సందర్భంగా ఆ చిన్నారి తన తండ్రి కోసం ఓ పాట పాడి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అయితే నేడు సుకృతి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌.. ట్విటర్‌ వేదికగా ఆ పాటకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశాడు. ఇది విన్న నెటిజన్లు వావ్​ అంటున్నారు.

భార్య తబిత, పిల్లలు సుక్రాంత్​, సుకృతితో దర్శకుడు సుకుమార్​

"డార్లింగ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ముద్దుల కుమార్తె సుకృతికి పుట్టినరోజు శుభాంకాంక్షలు. తండ్రి పుట్టినరోజు కోసం తాను పాడిన పాటను.. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్నా. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను"

-- దేవిశ్రీ ప్రసాద్​, సంగీత దర్శకుడు

సుకృతి టాలెంట్‌ చూసి నెటిజన్లు అబ్బురపడుతున్నారు. సుకృతిలో మంచి ప్రతిభ ఉందని పేర్కొన్నారు. 'నైస్‌ వాయిస్‌', 'అమేజింగ్‌ వాయిస్‌', 'సో బ్యూటీఫుల్', 'చాలా బాగుంది. గాడ్‌ బ్లెస్‌ యూ' అని కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం సుకుమార్‌, అల్లు అర్జున్​ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నాడు.

Last Updated : Feb 18, 2020, 12:07 AM IST

ABOUT THE AUTHOR

...view details