నితిన్, నభా నటేశ్ జంటగా రూపొందిన చిత్రం 'మాస్ట్రో'. ప్రముఖ నాయిక తమన్నా కీలక పాత్ర పోషించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. 'కళ్లు కనపడకపోతే ఉండే ఇబ్బందులు అందరికీ తెలుసు' అంటూ నితిన్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం అలరిస్తోంది. అంధుడిగా నితిన్ నటన మెప్పిస్తోంది.
నభా నటేశ్, తమన్నా తమ అందంతో, అభినయంతో ఆకట్టుకుంటున్నారు. 'నువ్వు ప్లే చేసిన ట్యూన్ చాలా బాగుంది అరుణ్' అని నభా చెప్పగానే 'బట్, సమ్‌థింగ్ ఈజ్ మిస్సింగ్' అంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు నితిన్. క్రైమ్ సన్నివేశాలు ఉత్కంఠగా సాగాయి. మహతి స్వర సాగర్ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ఈ చిత్రం హిందీలో విజయవంతమైన 'అంధాధున్' రీమేక్‌గా రూపొందింది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. కథానాయకుడిగా నితిన్‌కిది 30వ చిత్రం.
'పుష్ప' నుంచి అప్డేట్