తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నటుడు విశాల్​కు షాకిచ్చిన మద్రాసు హైకోర్టు! - లైకా ప్రొడక్షన్స్​

Vishal madras high court: తమిళ నటుడు విశాల్​కు మద్రాస్​ హైకోర్టులో చుక్కెదురైంది. లైకా సంస్థ నుంచి ఆయన తీసుకున్న రుణానికి సంబంధించి రూ.15 కోట్లు డిపాజిట్‌ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

Madras High court orders Vishal to deposit 15 crores
నటుడు విశాల్​

By

Published : Mar 13, 2022, 7:31 AM IST

Updated : Mar 13, 2022, 8:29 AM IST

Vishal madras high court: లైకా సంస్థ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించి రూ.15 కోట్లు డిపాజిట్‌ చేయాలని నటుడు విశాల్‌ను మద్రాసు హైకోర్టు ఆదేశించింది.

ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. అప్పుగా తీసుకున్న రూ.21.29 కోట్లు ఇవ్వకుండా.. 'వీరమే వాగై సుడుం' అనే చిత్రాన్ని విడుదల చేయడానికి, శాటిలైట్‌, ఓటీటీ హక్కుల విక్రయానికి విశాల్‌ సిద్ధమయ్యారని, వాటిపై నిషేధం విధించాలని లైకా సంస్థ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.

ఈ కేసు విచారించిన జస్టిస్‌ సెంథిల్‌ కుమార్‌ రామమూర్తి.. రూ.15 కోట్లు హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్‌ పేరున బ్యాంకులో మూడు వారాల్లో డిపాజిట్‌ చేయాలని విశాల్‌ను ఆదేశించారు. విచారణను 22వ తేదీకి వాయిదా వేశారు.

ఇదీ చూడండి: అఖండ.. యావత్ భారత్​ను తలెత్తుకునేలా చేసింది: బాలకృష్ణ

Last Updated : Mar 13, 2022, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details