తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Actor vijay bmw car: హీరో విజయ్​కు హైకోర్టులో ఊరట - విజయ్ బీస్ట్ మూవీ

Vijay high court: డబ్బింగ్​ సినిమాలతో తెలుగువారికి సుపరిచితమైన స్టార్ హీరో విజయ్​కు హైకోర్టులో ఊరట లభించింది. పన్ను ఎగవేత కేసులో అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర స్టే జారీ చేసింది.

Vijay
విజయ్

By

Published : Jan 29, 2022, 10:12 AM IST

Vijay BMW car tax case: తమిళ హీరో విజయ్​కు హైకోర్టులో ఊరట లభించింది. బీఎండబ్ల్యూ కారు పన్ను మినహాయింపు కేసు ఇంకా కోర్టులో ఉన్నందున అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని వాణిజ్య పన్నుల శాఖను ఆదేశించింది. ఈ క్రమంలో శుక్రవారం, మధ్యంతర స్టే ఆర్డర్ జారీ చేసింది.

తమిళ స్టార్ విజయ్.. కొన్నాళ్ల క్రితం లండన్​ నుంచి బీఎండబ్ల్యూ లగ్జరీ కారు కొన్నారు. అయితే దానికి ఎంట్రీ ట్యాక్స్ చెల్లించకపోవడం వల్ల వాణిజ్య పన్నుల శాఖ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ విషయమై విచారణ జరిపిన ప్రత్యేక నాయమూర్తి ట్యాక్స్ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రముఖ నటీనటులు ఇలా పన్ను ఎగవేయడం సరికాదని సదరు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం పన్ను చెల్లించిన విజయ్.. ప్రత్యేక న్యాయమూర్తి వ్యాఖ్యలు తొలగించాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే విషయమై శుక్రవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఆ వ్యాఖ్యల్ని తొలగించాలని ఆర్డర్స్ జారీ చేసింది.

విజయ్ 'బీస్ట్' సినిమా ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఈ దీపావళికి ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు.

విజయ్ బీస్ట్ మూవీ

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details