తమిళ స్టార్ హీరో సూర్యకు మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. రూ. 3.11 కోట్లు చెల్లించాలంటూ ఆదాయపు పన్ను శాఖ ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ సూర్య వేసిన పిటిషన్ను తోసిపుచ్చింది.
2010లో సూర్యకు సంబంధించిన ఆస్తిపై సోదాలు నిర్వహించింది ఆదాయపు పన్ను శాఖ. అనంతరం.. 2007-08, 2008-09 ఏడాదిలో లెక్కల్లో లేని పలు ఆదాయాలకు సంబంధించి రూ. 3.11 కోట్ల పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. 2018లో దీన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశాడు నటుడు సూర్య. ఈ పిటిషన్పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. సెలబ్రిటీలు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని చెప్పింది. ఐటీ శాఖ జారీ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది.