తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Indian 2: హైకోర్టులో దర్శకుడు శంకర్​కు ఊరట - అన్నియన్​ రీమేక్

కమల్​హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఇండియన్ 2'. పలు కారణాలతో సినిమా షూటింగ్(Indian 2 Controversy) ఆలస్యమవడం వల్ల శంకర్​ మరో రెండు కొత్త చిత్రాలకు ఒప్పుకొన్నారు. దీంతో ఆగ్రహించిన నిర్మాణ సంస్థ కోర్టును(Lyca Productions Plea) ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన మద్రాస్​ హైకోర్టు దర్శకుడు శంకర్​కు అనుకూలంగా తీర్పును ఇచ్చింది.

Madras HC dismisses Injunction Filed By Lyca Productions Against Shankar
Indian 2: మద్రాస్​ హైకోర్టులో దర్శకుడు శంకర్​కు ఊరట

By

Published : Jul 4, 2021, 10:33 AM IST

Updated : Jul 4, 2021, 11:49 AM IST

'భారతీయుడు 2' వివాదంలో(Indian 2 Controversy) దర్శకుడు శంకర్‌కు ఊరట లభించింది. ఆయనపై ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ వేసిన పిటిషన్‌ను(Lyca Productions Plea) మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. దీంతో శంకర్‌ తనకు నచ్చిన సినిమాలను తెరకెక్కించే వీలు కలిగింది. అంతేకాదు.. నిర్మాణ సంస్థ కోరిన రూ.170.23 కోట్ల అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..

గతంలో కమల్‌హాసన్‌, శంకర్‌ కలయికలో 'ఇండియన్'(భారతీయుడు) చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమాకు కొనసాగింపుగా 'ఇండియన్‌ 2'ను ప్లాన్‌ చేశారు. చిత్రీకరణ కూడా మొదలుపెట్టారు. తొలుత చిత్ర నిర్మాణ వ్యయం రూ.270 కోట్లుగా అంచనా వేశారు. నిర్మాణ సంస్థ విముఖత వ్యక్తం చేయడం వల్ల చర్చలు జరిపి రూ.250 కోట్లకు తగ్గించారు. అయినా సఖ్యత కుదరకపోవడం వల్ల రూ.236 కోట్లుగా బడ్జెట్‌ను నిర్ణయించారు. డైరెక్టర్‌ శంకర్‌ రెమ్యునరేషన్‌ రూ.36 కోట్లు. అయితే.. చిత్రీకరణ దశలో ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల షూటింగ్‌ ఆగిపోయింది. ఆ తర్వాత పలు కారణాల వల్ల షూటింగ్‌ పునఃప్రారంభం కాలేదు.

ఇదిలా ఉండగానే.. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా ఓ పాన్‌ ఇండియా చిత్రంతో పాటు 'అపరిచితుడు' హిందీ రీమేక్‌ను రణ్‌వీర్‌సింగ్‌తో తెరకెక్కించనున్నట్లు శంకర్‌ ప్రకటించారు. ఈ క్రమంలోనే నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ కోర్టును ఆశ్రయించింది. 'ఇండియన్ 2' పూర్తయ్యే వరకు శంకర్‌ వేరే సినిమాను తెరకెక్కించకుండా చూడాలని కోర్టును అభ్యర్థించింది. మే నెలలో అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం తీర్పును జూన్‌కు వాయిదా వేసింది. సామరస్యంగా చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ఇప్పుడు మరోసారి వాదోపవాదాలు పరిశీలించిన మద్రాసు హైకోర్టు డైరెక్టర్‌ శంకర్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

మార్గం సుగమం

శంకర్‌ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. 2019లో చేసుకున్న ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థ షరతులు పాటించలేదని, అలాంటప్పుడు అనుకున్న సమయానికి డైరెక్టర్‌ సినిమాను ఎలా పూర్తి చేస్తారని సందేహం వెలిబుచ్చారు. పైగా.. ఈ విషయంలో నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు నిర్మాణ సంస్థ ఒక్కసారి కూడా ప్రయత్నించకుండా డైరెక్టర్‌ను సంప్రదించకుండానే నేరుగా కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. అయితే.. ప్రస్తుతం వెలువడిన ఈ తీర్పుతో రామ్‌చరణ్‌ - శంకర్‌ కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా చిత్రం వీలైనంత త్వరగా పట్టాలెక్కేందుకు మార్గం సుగమం అయింది.

కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో 'ఇండియన్‌ 2' తెరకెక్కుతోంది. ఈ సినిమాకు శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ కీలక పాత్రలో నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పలు కారణాల వల్ల చిత్రీకరణ దశలోనే ఆగిపోయింది. ఈ క్రమంలోనే సినిమా చిత్రీకరణను పూర్తి చేశాకే శంకర్‌ తన కొత్త సినిమాను మొదలుపెట్టాలని నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించగా.. ఇప్పుడా పిటిషన్​ను కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పును ఇచ్చింది.

ఇదీ చూడండి.."ఇండియన్ 2' ఆలస్యానికి కమల్, లైకా కారణం'

'భారతీయుడు 2' పరిష్కారానికి ముందుకొచ్చిన కమల్​

Last Updated : Jul 4, 2021, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details