'ప్రేమమ్' సినిమతో వెండితెరకు పరిచయమై, అదే పేరుతో తెరకెక్కిన తెలుగు రీమేక్‌లోనూ నటించిన భామ మడోన్నా సెబాస్టియన్. మళ్లీ ఇన్నాళ్లకు టాలీవుడ్‌లోనూ నటించనుందని సమాచారం.
ఆ సినిమాలో మూడో హీరోయిన్గా మడోన్నా! - nani shyam singha roy movie
'శ్యామ్ సింగరాయ్'లో ఓ కథానాయికగా నటి మడోన్నాను ఎంచుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చలు దశలో ఉన్న ఈ విషయంపై త్వరలో స్పష్టత రానుంది.
హీరోయిన్ మడోన్నా
నాని 'శ్యామ్ సింగరాయ్' ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఇందులో మూడో కథానాయికకు చోటుందని, ఆ పాత్ర కోసమే మడోన్నాను సంప్రదించినట్లు తెలుస్తోంది.