తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ పాటకు మాధురి హావభావాలు అదుర్స్​! - మాధురీ దీక్షిత్ ​ సాంగ్స్

బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్​.. ఓ పాటకు అద్భుతంగా  హావాభావాలు పలుకుతూ ఓ వీడియోను పోస్ట్​ చేసింది. నెటిజన్లకు విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​గా మారింది. అది మీరు చూసేయండి..

Madhuri Dixit
మాధురీ దీక్షిత్

By

Published : Apr 21, 2021, 5:47 PM IST

Updated : Apr 21, 2021, 5:55 PM IST

బాలీవుడ్​ నటి మాధురీ దీక్షిత్​.. అందం, అభినయం, సూపర్​ డ్యాన్స్​కు కేరాఫ్​ అడ్రస్​. కళ్లతో ఆమె పలికించే భావాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ సోషల్​ మీడియాలో చురుగ్గా ఉండే ఈ అందాల తార.. తాజాగా ఓ వీడియో పోస్ట్​ చేసి అభిమానులను ఫిదా చేసింది.

గతంలో యువతను ఉర్రూతలూగించిన 'బాజ్రే ద సిత్తా' పాటకు అద్భుతంగా హావాభావాలు కనబరిచింది. ఇంతకంటే బాగా ఎవరూ చేయలేరేమో అనేంతలా ముఖకవళికలు ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆక్టటుకుంటుంది. అభిమానులు కామెంట్లు, లైక్స్​తో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Last Updated : Apr 21, 2021, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details