తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మధుబన్' సాంగ్ వివాదం.. సన్నీ లియోనీకి మంత్రి వార్నింగ్ - sunny videos

Sunny leone song: సన్నీ లియోనీ 'మధుబన్' వివాదం ముదిరింది. సన్నీకి ఓ మంత్రి వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో సదరు సంగీత సంస్థ పాటలో మార్పునకు అంగీకరించింది.

sunny leone
సన్నీ లియోనీ

By

Published : Dec 26, 2021, 10:40 PM IST

'Madhuban' song: ఇటీవల కాలంలో వివాదస్పదమైన 'మధుబన్' ఆల్బమ్ సాంగ్ విషయమై నటి సన్నీ లియోనీ, సింగర్​కు మూడు రోజులు గడువిస్తూ మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్పందించిన సంగీత సంస్థ సరిగమ.. 'లిరిక్స్ మారుస్తామని హామీ ఇచ్చింది. దేశ ప్రజల మనోభావాలకు తాము గౌరవమిస్తామని, లిరిక్స్​తో పాటు పాట పేరు మారుస్తాం. అలానే కొత్త పాటను మూడు రోజుల్లో అప్డేట్ చేస్తాం' అని స్పష్టం చేసింది.

1960ల నాటి 'కోహినూర్' సినిమాలోని 'మధుబన్' పాటకు మార్పులు చేసి కొత్త 'మధుబన్' గీతాన్ని కంపోజ్ చేశారు. అయితే ఇందులో సన్నీ వేసిన స్టెప్పులు అభ్యంతరకరంగా ఉన్నాయని నెటిజన్లతో పాటు ఉత్తరప్రదేశ్​ మథురకు చెందిన పలువురు పురోహితులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

సన్నీలియోన్ 'మధుబన్‌ మే రాధిక నాచే' వీడియో ఆల్బమ్‌ సాంగ్ డిసెంబర్ 22న విడుదలైంది. ఇందులో సన్నీ హాట్‌ హాట్‌గా పెర్ఫార్మెన్స్‌ చేసింది. పాట కూడా వ్యూస్ పరంగా దూసుకెళ్తుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details