తెలుగు సాహితీ ప్రపంచంలో మధుబాబు 'షాడో' నవలలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నవలలకు వీరాభిమానులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇవి దృశ్యరూపంలోకి రానున్నాయి. ఏకే ఎంటర్ టైన్‌మెంట్స్ వీటిని వెబ్ సిరీస్‌గా తెరకెక్కించేందుకు సిద్ధమైంది. 'మధుబాబు షాడో' పేరుతో రూపొందించనున్నారు. తాజాగా నిర్మాత అనిల్ సుంకర దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు.
"20వ శతాబ్దంలో అతడి గురించి చదివారు. అదే ఆటిట్యూడ్‌తో 21 శతాబ్దంలో అతడిని చూడబోతున్నారు. మా మీద నమ్మకం ఉంచి 'షాడో' కథలకు దృశ్యరూపం ఇవ్వడానికి అనుమతించినందుకు మధుబాబు గారికి ధన్యవాదాలు."