యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరోయిన్ నిహారిక నిర్మాతగానూ అరంగేట్రం చేయనుంది. 'ముద్దపప్పు ఆవకాయ', 'నాన్నకూచి' లాంటి వెబ్‌సిరీస్‌తో నెట్టింట సందడి చేసిన నిహారిక మరోసారి డిజటల్ ప్రేక్షకులను పలకరించబోతుంది. 'మ్యాడ్ హౌజ్' పేరుతో ఓ కామెడీ వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. హైదరాబాద్‌లో ఈ సిరీస్‌కు సంబంధించిన విశేషాలను వెల్లడించింది.
'మ్యాడ్ హౌజ్' పేరుతో మెగా హీరోయిన్ వెబ్‌సిరీస్ - niharika
మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల 'మ్యాడ్ హౌజ్' పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. అక్టోబర్ నుంచి యూట్యూబ్‌లో ప్రసారం కానుందీ సిరీస్. మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించాడు.
నిహారిక కొణిదెల
ఈ సిరీస్‌కు సంబంధించి 100 ఎపిసోడ్లను నిర్మించినట్లు నిహారిక తెలిపింది. పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పతాకంపై మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించాడు. సంతోష్ నందివాడ, కృతిక సింగ్, శివాని, కార్తీక్ అప్పల కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ నుంచి యూట్యూబ్‌లో ఈ సిరీస్ ప్రసారం కానుంది.
ఇదీ చదవండి: ట్రైలర్: వృద్ధుల పాత్రల్లో అదరగొట్టిన భూమి, తాప్సీ
Last Updated : Oct 1, 2019, 5:34 PM IST