బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'తలైవి'. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో కీలకపాత్రల్లో కనిపించనున్నారు అరవిందస్వామి, మధుబాల జోడీ. వీరిద్దరూ జాతీయ అవార్డు చిత్రం 'రోజా' తర్వాత మళ్లీ 25 ఏళ్లకు కలిసి నటిస్తున్నారు.
ఈ చిత్రం తెలుగు, తమిళంలో 'తలైవి'గా, హిందీలో 'జయ' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇంతకుముందు తెలుగులో 'కణం', 'అభినేత్రి2' చిత్రాలకు దర్శకత్వం వహించాడు.