తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మథనం టీజర్​ రిలీజ్ వేడుకలో 'సైరా' స్టార్​ - surendar reddy

శ్రీనివాస్ సాయి, భావన జంటగా నటించిన 'మథనం' టీజర్​ రిలీజ్​ వేడుక హైదరాబాద్​లో జరిగింది. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

మథనం టీజర్​ రిలీజ్

By

Published : Jul 22, 2019, 6:02 PM IST

మథనం సినిమా టీజర్ రిలీజ్ ఫంక్షన్

'వినరా సోదరా' సినిమాతో హీరోగా మారిన శ్రీనివాస్ సాయి.. 'మథనం' చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హైదరాబాద్​లో సోమవారం టీజర్​ విడుదల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా దర్శకుడు సురేందర్​రెడ్డి హాజరయ్యాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించాడు.

ఈ సినిమాతో డాన్సర్ అజయ్ సాయి మణికందన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. భావన హీరోయిన్. అశోక్ ప్రసాద్, దివ్య ప్రసాద్ నిర్మాతలు. గేమ్ ఓవర్ సినిమాకు సంగీతమందించిన రాన్ ఎహాన్ స్వరాలు సమకూర్చాడు.

"నేను 15 సంవత్సరాలు చీకటి గదిలో ఉన్నా.. ఇప్పుడు బయటకు రావడానికి కారణం ప్రేమ", "ప్రేమ... ఆలోచించుకోవడానికి అందంగా ఉంటుంది, దక్కించుకోవడానికి కష్టంగా ఉంటుంది", "ముందు వాడ్ని వాడికి పరిచయం చేయండి... లేదంటే మీకు మీ కొడుకు దక్కకుండా పోతాడు" అంటూ టీజర్​లోని ఈ డైలాగ్​లు సినిమాపై ఆసక్తి కలిగిస్తున్నాయి.

ఇది చదవండి: ఏంజెలినా జోలీ తర్వాతి సినిమా ఇదే..

ABOUT THE AUTHOR

...view details