ప్రస్తుత జనరేషన్‌ను ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం 'మ్యాడ్'. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆసక్తికరంగా ఉన్న ఈ ఫస్ట్‌లుక్ అందరినీ ఆకర్షిస్తోంది.
ఆకట్టుకుంటోన్న 'మ్యాడ్' మూవీ ఫస్ట్‌లుక్ - టాలీవుడ్ తాజా వార్తలు
అందరూ కొత్తవారితో తెరకెక్కిస్తున్న 'మ్యాడ్' ఫస్ట్‌లుక్ విడుదలైంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటున్న ఈ చిత్రంలో మాధవ్, స్పందన, రజత్ రాఘవ్, శ్వేతా వర్మ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు.
మోదెల టాకీస్ బ్యానర్‌పై టి.వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డితో పాటు వారి మిత్రులు నిర్మాతలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లక్ష్మణ్ మేనేని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాలో మాధవ్ చిలుకూరి, స్పందన, రజత్ రాఘవ్, శ్వేతా వర్మ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు.
ఈ సందర్బంగా డైరెక్టర్ లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ.. "8వ తేదీ రిలీజ్ చేసిన ప్రీలుక్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. మన చుట్టూ జరుగుతున్న కొన్ని జీవితాల నుంచి ప్రేరణ పొంది అంతే సహజంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న ఒక జంట, లివింగ్ రిలేషన్లో ఉన్న మరోజంట జీవితాల్లో ఎలాంటి మలుపులు జరిగాయన్న అంశాలు ఆసక్తిని కలిగిస్తాయి. కథనం, సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి" అంటూ చెప్పుకొచ్చారు.