హీరో మంచు మనోజ్, సాయిధరమ్ తేజ్‌తో కలిసి దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. అన్నట్టు వీరితో పాటు రెండు కుక్కలు ఉన్నాయి. అయితే ఈ రెండు శునకాలు డేటింగ్‌లో ఉన్నాయట. దీనికి సంబంధించి మనోజ్ ఈ విధంగా రాసుకొచ్చాడు.
వియ్యంకులు కాబోతున్న మనోజ్, సాయి తేజ్!
హీరో మంచు మనోజ్ సామాజిక మాధ్యమాల్లో ఓ సరదా ఫొటోను పోస్ట్ చేశాడు. ఇందులో సాయి ధరమ్ తేజ్‌తో పాటు అతడి కుక్క కూడా ఉంది. వీరిద్దరి పెంపుడు కుక్కలు డేటింగ్‌లో ఉన్నట్లు తెలిపాడు మనోజ్.
డేటింగ్‌లో మనోజ్, సాయి తేజ్‌ల పెంపుడు కుక్కలు
"ఇక్కడున్న టాంగో - జోయాలు డేటింగ్‌లో ఉన్నాయి. అయినా కూడా తమ వంతు బాధ్యతగా సామాజిక దూరం పాటిస్తున్నాయి. ఇలాంటి మంచి అల్లుడిని ఇచ్చినందుకు వియ్యంకుడు సాయిధరమ్ తేజ్‌కు ధన్యవాదాలు. అంతేకాదు త్వరలోనే టాంగ్ - జోయాలకు ముహూర్తాలు పెట్టి శుభలేఖలు వేయిస్తా" అంటూ సరదా వ్యాఖ్య జోడించాడు మనోజ్.
మనోజ్ ప్రస్తుతం 'అహం బ్రహ్మాస్మి' అనే చిత్రంలో నటిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటరు'తో బిజీగా ఉన్నాడు.