తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మాచర్ల నియోజకవర్గం' ఫస్ట్​ ఎటాక్​ వీడియో​.. జాన్వీ కొత్త చిత్రం - nithin Macherla Niyojakavargam first attack video

Macherla Niyojakavargam Movie: కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చేశాయి. నితిన్ 'మాచర్ల నియోజకవర్గం', వరుణ్​ ధావన్​,జాన్వీ కపూర్​ల కొత్త చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

Macherla Niyojakavargam Movie
Macherla Niyojakavargam Movie

By

Published : Mar 30, 2022, 2:59 PM IST

Updated : Mar 30, 2022, 3:59 PM IST

Macherla Niyojakavargam Movie: ఐఏఎస్‌ అధికారి పాత్రలో నితిన్‌ నటిస్తున్న చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ఈ సినిమాకు సంబంధించి 'ఫస్ట్​ ఎటాక్'​ పేరుతో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది చిత్రబృందం​. ఇందులో నితిన్​ గొడ్డలి పట్టుకుని పది మంది వెేటాడుతూ కనిపించారు. ఈ పోరాట సన్నివేశం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఎమ్‌.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృతి శెట్టి కథానాయిక. ఈ చిత్రం జులై 8న ప్రేక్షకుల ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Janhvi Kapoor New Movie: గత కొంత కాలంగా వరుణ్​ ధావన్​, 'ఛిఛోరే' ఫేమ్​ నితీష్​ తివారి కాంబినేషన్​లో ఓ సినిమా తెరకెక్కబోతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ పుకార్లకు తెరదించుతూ హీరో వరుణ్​ ధావన్​ అధికార ప్రకటన చేశారు. "సాజిద్​ నడియాడ్​ ​ వాలా నిర్మాతగా, నితీష్​ తివారి దర్శకత్వంలో జాన్వీ కపూర్​తో కలిసి సినిమా ఎగ్జైటింగ్​గా ఉంది" అని పోస్ట్​ చేశాడు. ఈ చిత్రాన్ని 2023 ఎప్రిల్​ 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

జాన్వీ కపూర్​

ఇదీ చదవండి:చిరుతో అందుకే చేయట్లేదు.. విజయ్​ వల్లే సాధ్యమైంది: పూరి

Last Updated : Mar 30, 2022, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details