తెలంగాణ

telangana

By

Published : Apr 10, 2020, 1:13 PM IST

ETV Bharat / sitara

'పాత్ర కోసం ఆ విషయంలో కాంప్రమైజ్​ కావాలన్నారు'

లైంగిక వేధింపుల గురించి మాట్లాడిన నటి మాన్వీ గాగ్రూ.. పాత్ర కోసం, ఓసారి ఆ విషయంలో తనను కాంప్రమైజ్ కావాలన్నారని చెప్పింది.

Maanvi Gagroo Reveals She Was Asked To "Compromise" To Get A Role In A Web-Series
'పాత్ర కోసం ఆ విషయంలో కాంప్రమైజ్​ కావాలన్నారు'

'టీవీఎఫ్ ట్రిప్లింగ్', 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్' వంటి వెబ్​ సిరీస్​లతో పాపులర్ అయిన బాలీవుడ్ నటి మాన్వీ గాగ్రూ.. మీటూ అనుభవాలు తనకూ ఎదురయ్యాయని చెప్పింది. తన ఆవేదనను వెల్లడించింది. ఓ వెబ్​ సిరీస్​లోని పాత్ర కోసం, ఓ వ్యక్తి తనను కాంప్రమైజ్​ కావాలన్నాడని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

"గతేడాది ఓ వెబ్​ సిరీస్​లో నటించాలంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. రెమ్యునరేషన్​ విషయం తక్కువైందని నేను చెప్పగా, ఒకేసారి దానిని మూడురెట్లు పెంచాడు. బదులుగా నన్ను తనతో కాంప్రమైజ్ కావాలని చెప్పాడు. నాకు కోపమొచ్చి, చెడమడా తిట్టేశాను. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పి, ఫోన్ పెట్టేశాను. ఇప్పటికీ ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయంటే నమ్మలేకపోతున్నా"

-మాన్వీ గాగ్రూ, బాలీవుడ్​ నటి

'ధూమ్ మచావో ధూమ్' టీవీ షోతో పరిచయమైన మాన్వీ.. అనంతరం సినిమాలతో పాటు వెబ్ సిరీస్​లు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్', 'ఉడ్జా చమన్' సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. త్వరలో 'ఫోర్​ మోర్​ షాట్స్​ ప్లీస్​' వెబ్ సిరీస్​​ సెకండ్​ సీజన్​తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి : అల్లు అర్జున్​పై కేరళ ముఖ్యమంత్రి ప్రశంసలు

ABOUT THE AUTHOR

...view details